తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,యువనేత నారా లోకేష్ భావితరాలకు మార్గదర్శి అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అన్నారు.
నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఆదివారం తిరుపతిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఆర్ పి శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పి.మధుబాబు, తిరుపతి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కరణం సందీప్ నేతృత్వంలో 600 మందికి ఫుడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తిరుపతి మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి పార్లమెంట్ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.

Discussion about this post