తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తొట్టంబేడు మండలం శివనాథపురంలో గల అమ్మ ఆశ్రమంలో కేక్ కట్ చేశారు.
ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంచి పెట్టారు. లోకేష్ ఇలాంటి జన్మదినం వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలకు నిధి ఏర్పాటు చేసిన ఘనత లోకేష్ కే దక్కిందన్నారు.
నేటి యువతకు లోకేష్ ఆదర్శమనీ, భవిష్యత్తులో ఆయన ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ఆమె చెప్పారు. అందుకోసం టీడీపీ కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుజాత, నెమళ్ళూరు బుజ్జి, సుజాత, మహేష్, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post