చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని మంగళవారం అఖిల భారత సీమ సురక్షా సహ ప్రముఖ్ మురళీధరన్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు కోలంగారి పోలయ్య దర్శించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా వీరిని బెస్త సంఘం నేతలు కన్నయ్య, నెల్లూరు జగదీష్, కాట్రపల్లి మోహనకృష్ణ, నెల్లూరు సురేష్, చంద్రశేఖర్ ఈ నేతలకు శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలోఆర్ ఎస్ ఎస్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, మంగిరెడ్డి, ప్రకాష్, సురేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉమాశంకర్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post