అన్ని వర్గాల పిల్లలకు విద్య ఉచితంగా బోధించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. తిరుపతి నగరం సుందరయ్య నగర్ లోని సుందరయ్య కమ్యూనిటీ హాలులో బుధవారం భగత్ సింగ్ ఉచిత ట్యూషన్ సెంటరును రాఘవులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనాతో విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైందన్నారు. ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పటికీ… దీన్ని వినియోగించుకుంటున్న పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారని ఆయన తెలిపారు. అందరికీ సెల్ ఫోన్లు ల్యాప్ టాప్ లో నెట్ కనెక్షన్ లో లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా కరోనా తో విద్యార్థులు ఇంటికే పరిమితమై నందున విద్యార్థులు మానసికమైన సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వీరందరికీ చదువు రావాలంటే కష్టపడి చదవడం ఇష్టపడి నేర్పడం చేయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వచ్చిన తర్వాత విద్యార్థుల పైన ఒత్తిడి గురి చేయడం జరుగుతోందన్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థుల పైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని…దీని వలన విద్యార్థులు తీవ్రమైన మనోవేదనకు గురై చదువు చదువుకు దూరమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
డివైఎఫ్ఐ, మేక్ మై బేబీ జీనియస్ సంయుక్తంగా ట్యూషన్ సెంటర్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు.
మీకు మై బేబీ జీనియస్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్ భాస్కర్ రాజు మాట్లాడుతూ తాము మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు పిల్లలకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషలలో తప్పులు లేకుండా రాయడం అందమైన చేతివ్రాత భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తామని… ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్ర అధ్యక్షత వహించగా… సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఐద్వాజిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బాబు, ప్రకాష్ ప్రసంగించారు.
కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు సురేష్, అజయ్ కుమార్, చందన, మహేష్, విశ్వనాథ్, వెంకీ, సోము, కార్తీక్, సూర్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post