పెట్టుబడి దారీ వ్యవస్థ ప్రపంచంలో నెలకొన్ని ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణం ఈ వ్యవస్థ యొక్క వైఫల్యం దానికి ప్రత్యామ్నాయంగా సోషలిజాన్ని నిర్మించాలని ఫిబ్రవరి 21న ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున రెడ్ బుక్ డే కార్యక్రమాని జయప్రదం చేయాలని తిరుపతిలో ని సిపిఎం జిల్లా కార్యాలయంలో మూడు పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది.
పుస్తక ఆవిష్కరణ లో ప్రముఖ రచయితలు డాక్టర్ వి.ఆర్ రాసాని ,సాకం నాగరాజు, ప్రముఖ జర్నలిస్ట్ రాఘవ శర్మ డాక్టర్ గోవిందు సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే మురళి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.జయ చంద్ర ఐద్వా జిల్లా కార్యదర్శి పిసాయి లక్ష్మి సిఐటియు నగర అధ్యక్షులు టి సుబ్రమణ్యం కార్యదర్శి ఆర్ లక్ష్మి వేణు జయంతి మల్లికార్జున్ రావు విశ్వనాధ్ తదితరులు ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ను చదువుదాం… సమాజాన్ని మారుద్దాం అనే నినాదంతో పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వహించడం జరుగుతుంది. కారల్ మార్క్స్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక ఎంతో గొప్పది. సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉపయోగపడుతుందిఅని అన్నారు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదం ఎంతో కీలక పాత్ర పోషించింది. శ్రామికులు కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారీ సమాజానికి ధీటుగా ఒక సోషలిస్టు వ్యవస్థ మాత్రమే నిలబడుతుందని రాసినటువంటి గ్రంథాల్లో ఇది నిరూపించబడినది ప్రపంచంలోనే పెట్టుబడి గ్రంథం చాలా అమూల్యమైనది అని పిలుపునిచ్చారు.
రష్యాలో కమ్యూనిస్టు పార్టీ పోయిన తర్వాత ఇంకా ఏ ఇజం లేదని పెట్టుబడిదారులు ప్రచారం చేశారు దానికి దీటుగా క్యూబాలో చైనాలో వియత్నాంలో కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగురవేసి సిద్ధాంతాన్ని వేగంగా ప్రజల కోసం అందించడం. జరుగుతుందని నిరూపించారు.
కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే సంపద సమాజ పరం అవుతుందని నిరూపించారు కమ్యూనిస్టు సిద్ధాంతం ఒక గుడ్డు విశ్వాసం కాదని ఇది ఒక శాస్త్రీయమైన అటువంటి విధానం అని నిరూపించారు కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక చదివి అర్థం చేసుకొని ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడాలని దానికోసం 21 వ తేదీ వరకు జరిగే మహోత్రమైన కార్యక్రమంలో లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
.

Discussion about this post