శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రావణ బ్రహ్మ వాహనంపై పరమేశ్వరుడు… మయూర వాహనంపై జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు పురవీధుల్లో ఊరేగనున్నారు.
లంకాధీశుడైన రావణ బ్రహ్మపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ స్వామి వారు.. మయూర వాహనంపై అమ్మవారు కావనున్నారు. కాగా ఉదయం పరమేశ్వరుడు హంస వాహనం పైనా.. పార్వతీదేవి యాళి వాహనం పైనా పురవీధుల్లో ఊరేగుతారు.
రేపు గాంధర్వరాత్రి
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ తిరునాళ్లను గాంధర్వరాత్రిగా పిలుస్తారు.
గాంధర్వ రాత్రి అంటే రావణాసురుడు ప్రధాన భూమిక పోషించగా.. నారద తుంబర్లతో పాటు గాంధర్వులు సమావేశమై సకల దేవ, భూత గణాల సమక్షంలో పరమేశ్వరుని కీర్తిస్తారు.
ఈ నేపథ్యంలో స్వామివారు రావణాసురునిపై… అమ్మవారు మయూర వాహనంపై ఊరేగుతారు.
.

Discussion about this post