శ్రీకాళహస్తీశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో మంగళవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు.
ఈయనతో పాటు కొంతమంది ధర్మకర్తల మండలి సభ్యలు కూడా బాధ్యతలు తీసుకున్నారు. భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి ఇబ్బందులు కలుగకుండా సాదాసీదాగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ… తనపై ఎంతో నమ్మకంతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.
ఆయనకు కృతజ్ఞతలు తెలియచేశారు. బియ్యపు మధు సహకారంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మాస్టర్ ప్లాన్ పనులు కూడా వేగవంతం చేస్తామని తెలిపారు. ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులతో కలసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహాశివరాత్రి పర్వదినాన శివుని సన్నిధిలో ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. శివయ్య సేవ చేయడానికి తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డికి రుణపడి ఉంటానన్నారు. శివయ్య సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

.
Discussion about this post