శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రాత్రి గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి నందిపై పురవిహారం చేశారు.
ఆదిదేవుని దేవేరి పార్వతీదేవి సింహ వాహనం అధిష్టించి స్వామి వారిని అనుసరించారు. అంతకు మునుపు శివ, పార్వతులను అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరింపచేశారు.
స్వామి, అమ్మవార్లకు ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను నంది. సింహ వాహనాలపై అధిష్టించి పురవిహారానికి తీసుకువచ్చారు.
విద్యుత్ దీప కాంతుల వెలుగులో స్వర్ణాభరణాలతో ధగధగ లాడుతున్న పార్వతీ పరమేశ్వరులను వీక్షించడానికి భక్తులకు రెండు కనులు చాలలేదు. స్వామి, అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్లి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో పెద్దిరాజు. ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
.

Discussion about this post