శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుని 9వ రోజైన శుక్రవారం రాత్రి సభాపతి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
దక్షయజ్ఞం సమయంలో సతీవియోగంతో పరమేశ్వరుడు యోగ ధ్యానంలోకి వెళ్లడంతో సర్వలోకాలు తల్లడిల్లి పోతాయి.
అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని సంతానంతో మాత్రమే మృత్యువు పొందే విధంగా వరాన్ని పొందుతాడు. శివునికి సతీదేవి లేదని… ఆయన వివాహం జరగదని తలచిన తారకాసురుడు తన వికృతరూపం చూపుతాడు.
దీంతో అదే సమయంలో స్కంధుని ధ్యానం కోసం పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది. ఆ సమయంలో నటరాజస్వామికి. శివకామసుందరితో దేవతలు ఘనంగా వివాహం జరుపుతారు.
ఈ వివాహ వేడుకలు ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని 16కాళ్ల మండపం వద్ద పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శివకామసుందరి సమేత నటరాజస్వామిని పురవీధుల్లో ఊరేగించారు.
పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
.

Discussion about this post