టిటిడి అనుబంధ ఆలయాల్లో అగరబత్తులతో పాటు పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన స్వామివారి ఫొటోలతో పాటు కీ చైన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు, క్యాలెండర్లు, డ్రై ఫ్లవర్ మాలలు భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచాలని జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనం లోని సమావేశ మందిరంలో సోమవారం జెఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉత్పత్తులపై భక్తులకు మరింత అవగాహన కల్పించేందుకు అన్ని ఆలయాల వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
అగర బత్తులు విక్రయించే కౌంటర్లలో పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన స్వామివారి ఫొటోలు కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు పంచగవ్య ఉత్పత్తులు, గోవు ప్రాముఖ్యత తెలియజేయాలన్నారు.
టిటిడి అనుబంధ ఆలయాలకు రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్ధీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, పారిశుద్ధ్యం నిర్వహణ, భద్రత, అన్నప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
డెప్యూటీ ఈవోలు పార్వతి, కస్తూరి బాయి, శాంతి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
.

Discussion about this post