జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం వచ్చే ఉత్తరాయణానికి పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ ప్రశాంతి రెడ్డి తో కలసి బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు.
ఆలయ నిర్మాణం.పనులు బేస్మెంట్ వరకు పూర్తి అయ్యాయని ఇంజినీరింగ్ అధికారులు అదనపు ఈవో కు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని కోటప్పకొండ లో తయారవుతున్న కొన్ని మెటీరియల్ ను మజీన్ కు రవాణా చేయాల్సి ఉందన్నారు. మరికొన్ని మెటీరియల్స్ ను స్థానికంగా సమీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
వచ్చే ఉత్తరాయణానికి పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో ఆదేశించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
.
Discussion about this post