విద్యుత్ చార్జీల పెంపు ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో లో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద
విద్యుత్ చార్జీల పెంపు ను నిరసిస్తూ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకివచ్చి న తరువాత ఇంత భారీ మొత్తంలో రూ”4300కోట్లు రూపాయలను ప్రజల పై భారాలు మోపడం దారుణం అన్నారు.
తనతండ్రి బాటలో నడుస్తానని చెప్పి నేడు విద్యుత్ చార్జీల భారం పేదల పై పెంచడం శోచనీయం అన్నారు. ఒకపక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ, సామాన్యులపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ, మరోపక్క విద్యుత్ చార్జీల భారం వేయడం దారుణం అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీల ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కోవడం దారుణమన్నారు ప్రజలు వచ్చేఎన్నికల లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎంపార్టీ పట్టణ కార్యదర్శి గంధం మణి పెనగడం గురవయ్య గెడి వేణు,కుమార్ వెలివేంద్రం కేశవ్ అమ్మ పద్మమ్మ ప్రసాద్ సిపిఐ నాయకులు శివ కుమార్ ఆర్ వై యస్ మనీ మోహన్ రెడ్డి ఇ యామిని పార్టీ నాయకులుపాల్గొన్నారు.
.