తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాహస్తీశ్వఆలయ ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా కేవీ సాగర్ బాబును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి హరి జవహర్ లాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ బాబు ప్రస్తుతం దేవదాయశాఖ తిరుపతి ఆర్ జేసీ గా పని చేస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధకారిగా పని చేస్తున్న డి.పెద్దిరాజును రెండు రోజుల కిందట కడప జిల్లా రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. పెద్దిరాజు స్థానంలో సాగర్ బాబును నియమించారు.
కాగా కాణిపాకం వరసిద్ధి ఆలయ ఈవోగా ఎంవీ సురేష్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈయన రాజమహేంద్రవరం ఆర్జేసీగా పని చేస్తున్నారు.
.

Discussion about this post