బాహుబలి మొదటి భాగం తర్వాత రెండో భాగం కోసం ఎదురు చూసినట్లే కేజీఎఫ్ చాప్టర్ వన్ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం అభిమానులు ఎదురు చూశారు.
మూడు ఏళ్ల తర్వాత వచ్చిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ప్రేక్షకులను తీసుకు వెళ్లి, గొప్ప అనుభూతికి లోను చేశాడు.
కథ విషయానికి వస్తే ఇది సీక్వెల్. చాప్టర్ వన్ గరుడ చనిపోవడంతో ముగుస్తుంది. ఈ సినిమా అక్కడే ప్రారంభం అవుతుంది. రాకీ బాయ్ ( హీరో యశ్) తన సామ్రాజ్యం ను వ్యాప్తి చేస్తాడు. తన లవ్ ఇంటరెస్ట్‌ను తెచ్చు కుంటాడు తన ఇంద్ర భవనం లోకి. అయితే శత్రువులు పెరుగుతారు. వారి మీద ఎలా విజయం సాధిస్తాడు అనేది కథ.
దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ కాంబినేషన్ లోనే ఒక మేజిక్ ఉంది. ఈ తరహా సినిమాను ఇంతకు ముందు భారతీయ ప్రేక్షకులు చూసి ఉండరు. లాజిక్ లేక పోయినా, కొత్త సెన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. 1970లలో భారత దేశాన్ని గొప్పగా చిత్రీకరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
హాలీవుడ్ ను మించి తీశాడు. ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కథ చెప్పడం బావుంది. ఒకే ఒక సీన్ నాకు ఇబ్బంది గా అన్పించింది. హీరో యశ్ తుపాకితో పార్లమెంట్ భవనంలోకి వెళ్ళడం సీన్ సెన్సార్ చేసి ఉండాల్సింది. ప్రశాంత్ నీల్ విజన్ కు, రాకీ బాయ్ ( హీరో యశ్) కు సలాం కొట్టాల్సిందే.
రవి బశ్రుర్ సంగీతం, భువన్ గౌడ ఫోటోగ్రఫీ, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ గొప్పగా ఉన్నాయి. కలర్ పాలట్ట్ బావుంది. ఎంత ఖర్చు పెట్టారో చెప్పటం కష్టం కానీ నిర్మాణ విలువలు, సీ జే వర్క్ గొప్పగా ఉన్నాయి.
నటినటులు విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. హీరో యశ్ ను మర్చి పోలెం. ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనిధి షెట్టి, రవీనా టాండన్, సంజయ్ దత్ గొప్పగా నటించారు. సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ టేర్రిఫిక్.
చాప్టర్ 3 కోసం ఎదురు చూసేలా చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు, విమర్శకుడు

.