సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయులపై పగ బట్టి వేసవి సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. పీఆర్సీ సమయంలో ఉపాధ్యాయులు చేసిన ధర్నాకు ప్రతీకారంగానే మే నెలలో బడులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
నూతన విద్యా విధానం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. పీఎఫ్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వం ఖాళీ చేసిందని, వారంలో రద్దన్న సీపీఎస్ అతి గతి లేదని తెలిపారు. ఉపాధ్యాయ వర్గాలపై జగన్ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఆందోళన చేయడమే నేరమన్నట్టు జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పీఆర్సీ విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలను ఎలాగోలా మాయ చేశారని, అయితే జీతం పైనే ఆధారపడిన ఉపాద్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే ఓ పి ఎస్ రద్దుకు సంబంధించి ఉపాధ్యాయులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దీంతో దిక్కారమును సైతుమా అంటూ జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష్య గట్టిందని ఆరోపించారు. విద్యాశాఖ దశాబ్దాల తరబడి వున్న సాంప్రదాయాలు తుంగలో తొక్కిందని విమర్శించారు. ఏళ్ల తరబడి ఉన్నత పాఠాశాలలు ఉదయం 9.45 గంటలకు కప్రారంభం అయ్యేవన్నారు. ఇప్పుడు ఉదయం 8.45 గంటలకే పెట్టారని చెప్పారు. ఇక ఒంటి పూట బడులను ఉదయం 7.30గంటలకే ప్రారంభించాలని హుకుం జారీ చేశారన్నారు. ఇక వేసవి సెలవుల విషయంలో ఈ కక్ష్య పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ఒక వైపు ఎండలు భగ భగ మంతున్నా మే 5 వరకు పాఠశాలలు నడపాలనాడం తప్పని చెప్పారు. ఉపాధ్యాయులు మే 20 వరకు పనిచేయాలని ఆదేశించడం జగన్ మొండి వైఖరికి నిదర్శనమని అన్నారు. పరీక్ష పేపర్లు దిద్దడం, మార్కుల ఆన్లైన్ చేయడం, నాడు, నేడు పనుల పర్యవేక్షించడం కోసమే మే 20 వరకు పాఠశాలలకు రావాలనడం అసంబద్ధ నిర్ణయమన్నారు. ఈ పనులన్నీ ఉపాధ్యాయులు ఇంటి వద్దనే చేయగలరని చెప్పారు. ఇక నాడు నేడు పనుల పర్యవేక్షణ అతి పెద్ద జోక్ లాంటిదని ఎద్దేవా చేశారు. ఇలా ఉపాధ్యాయ లోకంతో ఆడుకోవడం పైశాచిక వైఖరి తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికైనా జగన్ మొండితనం వీడి ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి కోరారు.
.

Discussion about this post