తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శనివారం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖనస మహర్షి జయంతి శ్రావణ పౌర్ణమి నాడు జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ సభ సెక్రెటరీ శ్రీ ప్రభాకర్ ఆచార్యులు, ఇతర ఆలయాధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post