* తల్లి తండ్రులే ఆదిగురువులు,
* జీవనశైలి లోపం వల్లే గుండెపోట్లు
తల్లి తండ్రులు బాల్యం నుంచే తమ పిల్లల పంచేంద్రియాలకు పదును పెట్టాలని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ సూచించారు. శనివారం స్థానిక మహతి ఆడిటోరియంలో జరిగిన మాతృశ్రీ టెక్నో స్కూల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ పిల్లలు గొప్పవారు కావాలని కలలు కంటే చాలదని, వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు.
తల్లి తండ్రులు తమ పిల్లలకు ఆది గురువులు, మార్గదర్శకులు కావాలని సూచించారు. చదువుతో పాటు పిల్లల సమగ్ర మానసిక అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. పోషక ఆహారం, సత్సంబంధాలు, చక్కని వ్యాయామం, సామాజిక స్పృహ, సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అయితే ఇప్పటి తల్లి తండ్రులు టెక్నాలజీ మాయలో పడి పిల్లల పెంపకంలో తగిన శ్రద్ద చూపడం లేదని అవేదన వ్యక్తం చేశారు.
పిల్లలను మంచి పాఠశాలల్లో చదివిస్తే సరిపోదని వివరించారు. పిల్లలకు తగిన సమయం కేటాయించి, ప్రేమ ఆప్యాయతలు అందించి, చదవడంలో తోడ్పడాలని చెప్పారు. ప్రముఖ మెజీషియన్ విజయ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సోదర భావం, దేశ భక్తి, అంకిత భావం పెంపొందించుకోవాలని కోరారు. పిల్లలకు విజ్ఞానం, వికాసం కలిగించడానికి అనువైన మ్యాజిక్ అంశాలు చేసి అలరించారు.
స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ నాయుడు తమ పాఠశాలలో అంకిత భావంతో పిల్లలకు పాఠాలు చెబుతున్నామని తెలిపారు. అందుకే ప్రతి ఏడాది వందశాతం ఫలితాలు, ర్యాంకుల సాధిస్తున్నామని చెప్పారు. తల్లి తండ్రుల సహకారం వల్ల ఇప్పుడు తమ పాఠశాల నగరంలో పేరున్న వాటిలో ఒకటయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
.

Discussion about this post