టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో తిరుపతి తాళ్లపాక పెద్ద గంగమ్మ దేవాలయం, వేశాలమ్మ దేవాలయాలను అభివృద్ధి చేయనున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. టిటిడి ఇంజినీరింగ్ అధికారులు నాగేశ్వరరావు, ప్రసాద్ లలో వెంట తోడుకొని గురువారం ఉదయం ఈ ఆలయాలను భూమన సందర్శించారు. ఆలయాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సూచనలు చేశారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతి లో పురాతన కాలంలో వెలసిన వేషాలమ్మ ఆలయాన్ని 80, 90 లక్షల రూపాయల అంచనాలతో ఆధునీకరించడంతో పాటు, తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయాన్ని 60 లక్షల రూపాయలకు పైగా నిధులతో పునర్ నిర్మించనున్నట్టు భూమన చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఏ వీ ధర్మారెడ్డిని తన అభ్యర్థన మేరకు స్పందిస్తూ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఈ ఆలయాల అభివృద్ధి చేసేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.
సాధ్యమైనంత త్వరలో, అంటే నాలుగైదు నెలల వ్యవధిలోనే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయ సంకల్పించినట్టు భూమన వివరించారు. చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు ఈ మేరకు అంచనాలను వేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించినట్టు చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల అన్ని పనులూ సకాలంలో పూర్తి అవుతాయన్న ఆశాభావాన్ని భూమన వ్యక్తం చేశారు.
.

Discussion about this post