టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సొంత నిధులతో సహాయం చేయాలని నిర్ణయించింది. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి చొరవతో జెఈవో సదా భార్గవి ప్రతిపాదన మేరకు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎన్.సి.సి ఆఫీసర్లు ఉదయ్, రవి, రమేష్, సీనియర్ క్యాడెట్లు గురువారం జేఈవో సదా భార్గవిని తిరుపతిలోని పరిపాలన భవనంలో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.
.

Discussion about this post