స్విమ్స్ లో వైద్య విద్య, పారా మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతను జేఈవో సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు. జేఈవో సదా భార్గవి అధికారులతో కలిసి భోజన శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి రుచి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. వంటశాల, భోజన శాల ను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బంది, విద్యార్థులకు సూచించారు.
ఈ తనిఖీలో డిప్యూటీ ఈవో గోవింద రాజన్, క్యాటరింగ్ విభాగం ప్రత్యేకాధికారి శాస్త్రి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post