“ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా
ఏమదినెప్పుడు మబ్బులలో యెగరేస్తుందో ఈ ప్రేమా
అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమా…”
ఈ పాట ఆగి పోయిన నా మొదటి సినిమా కోసం సీతారామ శాస్త్రి గారు రాసిన పాట.. ప్రేమ గురించి రాసిన ఈ పాటని ఎంతో ప్రేమించారు కాబట్టే తరువాత
“మనసంతా నువ్వే” లో తనే పాడి తెలుగువారికి అందించారు..
ఇది నాకు ఆయనతో వున్న అనుబంధంలో నేను గర్వించే జ్ఞాపకం..
ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..
సీతారామ శాస్త్రి గారు తెలుగు సినీ పాట సాధించుకున్న గొప్ప పురస్కారం
.. చంద్రసిద్ధార్థ్
సినీ దర్శకులు
ప్రముఖుల పరామర్శ
సినీ ప్రముఖులు చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, క్రిష్, డాక్టర్ గురువారెడ్డి, తమన్, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ తదితరులు మంగళవారం సాయంత్రమే కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సిరివెన్నెల భౌతిక కాయాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Discussion about this post