యేసుక్రీస్తు శాంతి వచనాలే సమాజాకి శ్రేయస్సు అని, సర్వమతాల సారాంశం ఒక్కటేనని ఫాస్టర్ రెవరెంట్ నోవాడేవిడ్ హిత బోధ చేసారు.
చంద్రగిరి, కొత్తపేటలో ఉన్న సౌత్ ఆంధ్ర చర్చిలో ఫాస్టర్ రెవరెంట్ నోవా డేవిడ్, ఫాస్టర్ రెవరెంట్ విక్టర్ లు క్రైస్తవ సోదరులకు హిత బోధనలు చేశారు.
సమాజంలోని జీవరాసుల పట్ల సానుభూతి కలిగి ఉండటమే యేసు క్రీస్తు సారాంశం అన్నారు.
యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం చంద్రగిరి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సౌత్ ఆంధ్రా లూధరన్ చర్చి మేనేజర్ మూర్తి, నర్లానజరత్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు.
ప్రతి ఒక్క యేసుక్రీస్తు మతస్తులు ఇతర మతాల వ్యక్తుల పైన సోదరభావంతో మెలగాలని అన్నారు.
Discussion about this post