దివంగత మాజీ ఎమ్మెల్యే ఆవుల మోహన్ రెడ్డి సోదరుడు మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని సోమవారం వందలాది మంది ప్రజలు కన్నీటి వీడ్కోలుతో సాగనంపారు.
ఆవుల ప్రభాకర్ రెడ్డి పార్థివ దేహం వద్ద ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి అనంతరం దహన క్రియల సందర్భంగా ఆయన పాడె మోయడం విశేషం.
ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని ఆయన కుటుంబ సభ్యులు, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆవుల కుటుంబం అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో రేణు మా కుల పల్లి జనసంద్రంగా మారింది.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ఆవుల ప్రభాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబసభ్యులకు తమ అండ దండలు ఉంటాయని హామీ ఇచ్చారు.
ఆవుల ప్రభాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, ఎన్ పి కుంట మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రామాంజులు, ఎంపీపీ నారాయణ రెడ్డి మల్లయ్య కొండ చైర్మన్ కె ఆర్ మల్ రెడ్డి , ఆర్ ఎం తండా మాజీ సర్పంచ్ సిద్ధ మల్ రెడ్డి, ఆర్టీసీ వైయస్సార్ యూనియన్ నాయకుడు బాబ్జి, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, అధికార పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Discussion about this post