చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. బ్యాంకులకు నమ్మకంగా సేవలందించాల్సిన ఏజన్సీ పెద్ద మొత్తంలో నిధులు కాజేసింది. పలు బ్యాంకులకు బురిడీ వేసి, భారీగా బ్యాంక్ సొమ్ము కాజేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బ్యాంకుల సొమ్మును ఏటీఎంలలో డిపాజిట్ చేసే ఏజెన్సీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. పలు బ్యాంకులను బురిడీ కొట్టించి 1.17 కోట్ల సొమ్ము కాజేశారు. ఈ విషయం బయటపడడంతో చిత్తూరు పోలీసులు బాధ్యులుగా భావిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 39 లక్షల 40 వేల రూపాయల రికవరీ చేశారు.
బ్యాంకుల సొమ్ము ఏటీఎం లలో డిపాజిట్ చేసే రైటర్ బిజినెస్ సర్వీస్ లిమిటెడ్ అనే ఏజెన్సీలో ఉద్యోగులుగా పని చేస్తూ ఉద్యోగులు ఈ రకమైన దగాకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. ఏజెన్సీ ఉద్యోగులు కుమ్మక్కై బ్యాంకుల సొమ్ము ఏటీఎంలలో ఉంచకుండా దోచేసినట్లు గుర్తించారు. ఏటీఎంలలోని సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకుని బ్యాంకు సొమ్ము కాజేసి జల్సాలకు ఖర్చు పెట్టుకున్నారు.
మోసపోయిన బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,
కరూర్ వైశ్యా బ్యాంక్, చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంక్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
.
Discussion about this post