దేశవ్యాప్తంగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతోంది. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తున్నట్టేనా? కేసుల సంఖ్య తగ్గడం శుభపరిణామమేనా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు మాత్రం తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో అలాంటి అభిప్రాయానికి రావద్దని చెబుతున్నారు. కరోనా ప్రమాదం ఇంకా దండిగానే పొంచి ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
కరోనాను పూర్తిగా జాయించ లేదు.. అసలు గడ్డు కాలం ముందే ఉందని, రాబోయే మూడు నెలల కాలం అత్యంత కీలకం అని ఆయన అంటున్నారు.
చలికాలం కరోనా వైరస్ వ్యాప్తికి అనువైనకాలం కావడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు.
పైగా, తెలుగు ప్రజలు ఆనందంగా జరుపుకునే పెద్ద పెద్డ ముఖ్యమైన పండుగలన్నీ ముందే వున్నాయి. ఆ నేపథ్యంలో పండుగల ద్వారా మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి పండుగల మామూలుగా చాలా పెద్ద సంఖ్యలో జనం గుమికూడా పండుగలు. వీటినించి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
కొవిడ్ వేక్సిన్ జనవరి నాటికి వచ్చేస్తుందని ప్రజల్లో ఆశలుండగా.. ఆవిషయంలో కూడా తెలంగాణ హెల్త్ డైరక్టర్ హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ రావటానికి చాలా సమయం పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజూ బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలని, శానిటేషన్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచిస్తున్నారు. కరోనా వల్ల మహిళలు, పిల్లలకంటే పురుషులకే ఎక్కువ ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
కరోనా నివారణ చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నామని, సొంత వైద్యం చేసుకోకుండా, .. ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించు కోవాలని ఆయన కోరారు.
.

Discussion about this post