
మావోయిస్టులు ఒక ఎమ్మెల్యేను, ఒక మాజీ ఎమ్మెల్యేను బలి తీసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నివ్వెరపరచింది. చాలా కాలంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ మావోయిస్టుల కదలికలు లేవని అనుకుంటున్న తరుణంలో.. ఈ జంట హత్యలు జరగడం అందరినీ నిర్ఘాంత పరిచే వ్యవహారమే. అయితే, గిరిజనుల కోసం కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేగా పేరున్నప్పటికీ.. ఎమ్మెల్యే కిడారిని బలితీసుకోవడానికి బాక్సయిట్ మైనింగే కారణం అని అంతా అనుకుంటున్నారు.
ఈ హత్య ను మావోయిస్టులే చేసి ఉండొచ్చు గాక.. కానీ.. అధికార పార్టీకి, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వాటా లేదా? అనే ప్రశ్న పలువురిలో కలుగుతోంది. స్థానికంగా ఎన్ని వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నా సరే.. బాక్సయిట్ మైనింగ్ ను ప్రభుత్వమే అనుమతిస్తూ వచ్చింది. సదరు బాక్సయిట్ మైనింగ్ కు ఈ రకంగా సహకరించడానికి ప్రభుత్వంలో ఎవరెవరికి ఎలాంటి, ఎంతెంత వాటాలున్నాయో మనకు తెలియదు.
కానీ, కిడారికి కూడా వాటాలున్నాయనే మావోయిస్టులు నమ్మినట్లు అనుకోవాలి. అందుకే వారు లేవనెత్తిన అంశాల మీద చర్చిద్దాం అని ఆయన ప్రతిపాదిస్తున్నా పట్టించుకోకుండా… అక్కడికక్కడే కాల్చి చంపేశారని అంతా అనుకుంటున్నారు. ఈ జంట హత్యల్లో చంద్రబాబు కూడా వాటా తీసుకోవాల్సిందేననే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
.

Discussion about this post