Warning: The magic method Post_Views_Counter::__wakeup() must have public visibility in /home/adarsini/public_html/wp-content/plugins/post-views-counter/post-views-counter.php on line 98
కళాతపస్వికి అశ్రుతర్పణం?? – Adarsini
  • About Us
  • Contact Us
  • Our Team
Sunday, September 14, 2025
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

కళాతపస్వికి అశ్రుతర్పణం??

admin by admin
February 3, 2023
0
కళాతపస్వికి అశ్రుతర్పణం??

ఆయన సినిమాలు భారతీయ కళల ఉనికిని తెలియజేస్తాయి.
నటరాజ సిరిమువ్వల సవ్వడి మన గుండెల్లో మారుమ్రోగుతాయి.

శంకరుని మెడలోని ఆభరణం కూడా “శంకరానాద శరీర” అంటూ మనల్ని ‘ఫణి’ముగ్దుల్ని చేస్తుంది.
నటకుడి జీవిత గతుల సంగతుల సాగర సంగమ ఘోష మనల్ని అవ్యక్తమైన అనుభూతికి లోనుచేస్తుంది. పాత్రలు మలిచిన రీతి తెలుగుదనపు మధ్యతరగతి ఆశలను, కళ మురళీ రవాలు ‘విశ్వనాధుని’ తలపులో జనిస్తే ఆ సిరివెన్నెలను మనందరిపై కురిపించి, మనోనేత్రంతో ప్రకృతిని ఎలా అనుభవించవచ్చో దర్శింపచేసిన విశ్వదార్శనికుని ప్రతిభకు అప్రతిభులై ఆనందానుభూతికి లోనవుతాము.

ఆదిదంపతులను శృతిలయలుగా భావించి చిరు మందహాసుడైన కుమారుడు దైవదత్తమైన కళల ద్వారా తల్లిదండ్రులను కలపడం, వారినుండి నేర్చుకున్న నడవడికను చూసిన ప్రేక్షకుడు నాకిలాంటి పుత్రుడుంటే బావుండును అనుకుని పిల్లలకు సంగీత నాట్యాలవైపు మళ్ళించే ప్రయత్నం చేసాము.

శివుని జటాజూటములోకి చేరకుంటే సురగంగకు విలువలేనట్లే తనకు కలిగిన ఆనందాన్ని పదిమందికి పంచకపోతే కళకు సార్ధకత లేదని, దాని ద్వారా పొందే ఆ ఆనంద స్వర్ణకమలాలు పరమశివునికి అర్పించి దాని ఫలాన్ని మనకి అందచేసారు.

ఆలోచనామృతము సహిత హితసత్యము, శారదా స్తన్యము అనే భావానికి తగ్గట్టుగా అమ్మ దయ ఉంటే శిశువు కూడా సంగీతపుటంచులు దాటగలడని ప్రతిభకు చిన్నపెద్దా తేడా లేదంటూ కొత్తనీటి ప్రవాహానికి పాతనీరు తొలగవలసిందేనని, అసూయను జయించినవాడు దైవదత్తమైన కళకు అర్హుడని, స్వాతికిరణాలలో మరో కొత్త ఉదయం తో జీవితం పండించుకోమని చెప్పినప్పుడు మనమందరిలో కలిగే ఆలోచనతో అరిషడ్వర్గాలను జయించడానికి ప్రయత్నించాము.

గొప్ప తాత్వికతను కథలకు జోడించి ప్రపంచ స్థాయిలో మన తెలుగు చిత్రరాజాలని నిలబెట్టిన ఈ “రాజర్షికి” ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?

నా హృదయ కమలాలని ఆయన పాదపద్మాలకు సమర్పించుకుంటున్నాను

ఇలా ఈ మహానుభావుని ఏ చిత్రం చూసినా ఒక తాత్వికత! ఒక తాద్యాత్మత! ఒక తర్కం! .

కళాతపస్వి తపస్సు చేసి ఆ ఫలాన్ని మాకందించాలనే తపన కాబోలు హృదయం కదిలే అంత శక్తివంతంగా మనముందు నిలిచాయి.

కళాతపస్వి!
విశ్వనాథ!
ఈ విశ్వం ఉన్నంతవరకు నీ కీర్తి అజరామరంగా ఉండాలని కోరుకుంటూ

 

అశ్రు నయనాలతో ??
చాగంటి ప్రసాద్
9000206163

Tags: chaganti prasadk viswanathkalatapasvikalatapasvi k viswanathsagarasangamam

Discussion about this post

Top Read Stories

No Content Available

VIDEO

https://youtu.be/qecT2wF60XU
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!