చంద్రగిరి మండలం, శానంబట్లలో జగనన్న గృహాలను స్పెషల్ ఆఫీసర్, ఛీఫ్ ఇంజనీర్ G.V ప్రసాద్ మండల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలైలో మోగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయడమైందన్నారు.
వర్షాలు, కోర్టు వ్యవహారాల కారణంగా పనులు ఆలస్యం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందన్నారు. అందులో భాగంగా శానంబట్ల లేఅవుట్ ఫీల్డ్ విజిట్ కు రావడం జరిగిందన్నారు.
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బందితో చర్చించారు. BPL, ఇతర ఇళ్ళు అన్ని కూడా జనవరి చివరికల్లా పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి టార్గెట్ ఇవ్వడమైందన్నారు.
పెండింగ్ ఉన్న 800 కోట్లు నిధులను కూడా విడుదలయ్యాయని ఆన్లైన్ ప్రాబ్లమ్ వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు.
OTS అనేది ఖచ్చితం కాదని అయితే రిజిస్టర్ డాక్యుమెంట్ కావల్సిన వారిని చైతన్య పరిచి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుంతుదన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ పద్మనాభం, EE శర్మ, DEE బాబు, AEలు సుబ్బారావు, శ్రీరామ్ రెడ్డి, DE మహేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్.తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post