తెలంగాణలో మహాకూటమి కింద అందరూ కలిసి మెలసి పోటీచేస్తున్నారా? లేదా, తమతో జట్టు కట్టడం మినహా మిగిలిన పార్టీల్లో ఎవ్వరికీ వేరే గతిలేదని కాంగ్రెస్ భావిస్తున్నదా అర్థం కావడం లేదు. ఎందుకంటే.. కూటమిలోని అన్ని పార్టీలపై కాంగ్రెస్ కర్రపెత్తనం చేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. తమ కూటమిలో ఉండాలంటే.. తాము చెప్పినట్లు వినాల్సిందేనని.. గీసిన గీత దాటకూడదని వారు వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ కాగా, వారికి ఆ దామాషాలో సీట్లు పంచాల్సింది బదులుగా గత ఎన్నికల్లో గెలిచిన 15 సీట్లు మాత్రమే ఇస్తాం అంటూ కాంగ్రెస్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో తెజస అధిక స్థానాలు కోరుకుంటండగా.. మీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థులెవరో మాకు పేర్లు ఇవ్వండి.. వారి గురించి సర్వేలు చేయించి.. మేం డిసైడ్ చేస్తాం అని కాంగ్రెస్ అడగడం.. అవమానకరంగానే భావిస్తున్నారు.
తాజాగా సీపీఐ తో కూడా కాంగ్రెస్ కు లొల్లి తప్పేలా లేదు. బహుశా వారే అతి తక్కువ సీట్లు పంచుకునే పార్టీ కావొచ్చు గానీ… ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోటీచేయదలచుకుంటున్న హుస్నాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ వదలిపెట్టేలా లేదు. ఆ స్థానం దక్కకుంటే సీపీఐ కూటమిలోనే ఉండకపోవచ్చు కూడా. అక్కడ కాంగ్రెస్ తరఫున ప్రవీణ్ రెడ్డి ఆల్రెడీ ప్రచారం మొదలెట్టేశారు.
ఆ రకంగా .. అందరి మీద కాంగ్రెస్ కర్రపెత్తనం చేస్తుండగా.. ఈ మహా కూటమి కేసీఆర్ ను ఓడించే సంగతి తర్వాత.. అసలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కలసి కట్టుగా ఉంటుందా? లేదా? అనే భయం ప్రజల్లో కలుగుతోంది.
.

Discussion about this post