ఏపీలో ఐటీ దాడులు జరుగుతోంటే.. తెలుగుదేశం పార్టీ మొత్తం కిందా మీదా అయిపోతోంది. కంగారు పడుతోంది. పదేపదే భుజాలు తడుముకుంటోంది. కేంద్రం మీద, మోడీ మీద నిందలు వేయడానికి సాహసిస్తోంది. తాజాగా అయితే తెలుగుదేశం మంత్రులు బెంగుళూరు మాట్లాడుతున్నప్పుడు కూడా.. సీఎం సన్నిహితుల మీదనే ఐటీ దాడులు చేస్తున్నారంటూ.. అక్కడి తెలుగు ప్రజల్లో కూడా కేంద్రంపై విముఖత పెంచే ప్రయత్నం చేశారు.
అయితే ఐటీ వర్గాల వైపు నుంచి మాత్రం అచ్చంగా.. ఆదాయపు పన్ను ఎగవేశారనే అభియోగాలు ఉన్న వారి మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయని, తెలుగుదేశానికి ముడిపెట్టుకోవడం అసంబద్ధం అని అంటున్నారు. ఈ మంత్రుల వ్యాఖ్యలను పోల్చి చూసినప్పుడు తెదేపాలో కూడా సీఎం సన్నిహితుల మీదనే దాడులు జరుగుతున్నట్లుగా ఉంది.
ఈ అంశాన్ని ఇలా ఎందుకు పరిగణించకూడదు. సీఎం సన్నిహితులుగా ఉన్నవారు.. తమకు ఏం కాదులే అనే ధీమాతో ఆదాయపు పన్ను విషయంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐటీ దాడులు అనేవి కేవలం ఎగవేత దారుల మీద మాత్రమే జరిగేవి. అలాంటప్పుడు.. వాటిని చూసి ఉలికి పడే బదులు, తమ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయంటే తమ వారు లోపం చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు అంటూ.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
.

Discussion about this post