ఢిల్లీ నుండి గల్లీ వరకు దశాబ్దాల క్రితమే రాజకీయ చక్రం తిప్పిన కుటుంబీకులలో ఓ మకుటం నేలరాలింది. 1967, 1972 సంవత్సరాల్లో తంబళ్లపల్లె ఫ్యామిలీ నుండి స్వాసంత్ర సమరయోధురాలు టి ఎన్ రఘునాథ్ రెడ్డి సతీమణి అనసూయమ్మ రెండుమార్లు తంబళ్లపల్లి ఎమ్మెల్యే గా కలిచర్ల కుటుంబంపై పోరాడి గెలిచింది.
ఆమె విద్యాధికురాలు అయినా స్వాతంత్రం కోసం జాతిపిత గాంధీజీ తో జైలుకెళ్లి పలుమార్లు భేటీ అయ్యారు. ఆయన సైతం మదనపల్లి కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.
టిఎన్ కుటుంబంలో ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓ మహిళ ఎన్నిక కావడం అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, ఐ టి ఐ, జూనియర్ కాలేజ్, పోలీస్ స్టేషన్, తో బాటు ప్రభుత్వ, పాఠశాలలు, గుళ్లు, మసీదులు కార్యాలయాలకు మొత్తం ఉచితంగా భూములు ఇవ్వడంతోపాటు అడిగినవారికి సాయం చేసే గుణం తో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
1983 అప్పటి ఎన్టీఆర్ హవా లో సైతం టి ఎన్ శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్ గా గెలవడం చారిత్రాత్మకం. నాటికీ నేటికీ టిఎన్ కుటుంబం పేద ప్రజల అభివృద్ధి కోసం తమ ఆస్తులను తృణప్రాయంగా వదలుకోవడం స్థానిక ప్రజలు చేసుకున్న అదృష్టం.
నిజాం పాలనలోనే వేలాది ఎకరాలు కలిగిన ఈ కుటుంబం పి టి ఎం మండలం నుండి కలకడ మండలం వరకు వీరి ఆస్తులు విస్తారంగా ఉండేవి. పేద ప్రజల కోసం తమ భూములన్నీ నిస్వార్ధంగా పంచడం వారి ఔదార్యానికి నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే టి ఎం అనసూయమ్మ మృతిపై తంబళ్లపల్లె నియోజకవర్గం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది.
ఆ కుటుంబం చేసిన సేవలు రాజకీయాలకతీతంగా నాయకులు మొత్తం మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నారు. ఫోటో రైట్ అప్ ః మాజీ ఎమ్మెల్యే టి ఎన్ అనసూయమ్మ.
Discussion about this post