చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మాజీ శాసనసభ్యులు కలిచెర్ల ప్రభాకరరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.
తమ అభిమాన నేత ఆరోగ్యం విషమించడంతో ఆయన అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు. కలిచెర్ల ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లనపల్లె శాసనసభ్యులు పెద్ధిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్ఢి ఆరా తీశారు. ప్రభాకరరెడ్ఢికి మెరుగైన వైద్యం అందించాలని సెయింట్ జాన్ ఆస్పత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన కడప ప్రభాకరరెడ్ఢి భూస్వామ్య కుటుంబానికి చెందిన వారు. ఈయన తండ్రి నరసింహారెడ్డి. ప్రభాకరరెడ్డికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పెద్దమండ్యంలో అయితే ఆయన చెప్పిందే శిలాశాసనం. తంబళ్లపల్లె నియోజకవర్గం ప్రజలు ఆయన్ను గౌరవంగా ‘అప్పా’ అని పిలుచుకుంటారు. ఉ
మ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభంజనం బలంగా వీచే సమయంలో 1989లో తంబళ్లపల్లె నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీనిని బట్టి ప్రభాకరరెడ్ఢికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎంత పట్టు ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. 1999, 2004ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కక పోవడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి చెందారు. వైసీపీ ఆవిర్భవించిన తరువాత ఆపార్టీలోకి చేరారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. ప్రభాకరరెడ్డికి తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి మచ్చ అంటలేదు. ప్రజల కోసం తన సర్వస్వం త్యాగం చేశారు. తన వద్దకు సాయం కోసం వచ్చిన వారికి కాదనకుండా సాయం చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన ప్రజాభిమానం చూరగొన్నారు.
రాజకీయాల కోసం ఆయన ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. తనను నమ్మిన వారికి ఏ సాయం చేయడానికైనా ఆయన వెనుకంజ వేయరు. అలాంటి నేత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సుమారు నెల రోజులుగా కలిచెర్లకు ఆరోగ్యం బాగాలేదు. చాలా కాలంగా ఆయన తన స్వగ్రామమైన కలిచెర్లలోనే ఉండేవారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల కిందట మదనపల్లెకు తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం బెంగళూరు తరలించారు.
.

Discussion about this post