వైకాపా ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు.. పేదల వంచన ప్రభుత్వం అని నిండ్ర మండల తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నగరి నియోజకవర్గ టిడిపీ ఇన్ ఛార్జి గాలి భానుప్రకాష్ విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటీఎస్ పథకం పేద ప్రజలను దోచుకోవడం కోసమేనని, ఎమ్మెల్యే రోజా కేవలం శిలాఫలకాలను వేయడం తప్ప ఒక ఇటుక కూడా వేయలేదని ఆయన విమర్శించారు.
నియోజకవర్గంలోని సహజ వనరులను దోచుకోవడమే రోజా కుటుంబం చేస్తున్న పని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోజాకు కోట్ల ఆస్తులు వచ్చాయని ఆయన ధ్వజమెత్తారు.
నిండ్ర మండల కేంద్రంలో జరిగిన నిండ్ర మండల తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో గాలి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు.
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదని పేదల వంచక ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. నవరత్నాల పేరిట ప్రజల కోసం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలలో తిరకాసు పెడుతూ పేదల వంచక ప్రభుత్వంగా మారిందని ఆయన దుయ్యబట్టారు.
పోలీసులు అక్రమ కేసులు పెట్టి, పేదల భూములు ఆక్రమణలు చేసి వారు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వైకాపా ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన అన్నారు.
ఎప్పుడో ఎన్టీఆర్ హయాం లో కట్టిన ఇళ్లకు, డీకేటీ పట్టాలు మంజూరు చేసిన ఇళ్లకు సైతం ఒన్ టైం సెటిల్మెంట్ పేరీట ప్రాంతాన్ని బట్టి డ్వాక్రా గ్రూపులలో లోన్లు పెట్టించి మరీ 10వేల నుంచి 20వేల వరకు కట్టించుకుంటున్నారని, ఇవన్నీ ప్రజా వంచక నిర్ణయాలని, రానున్న రోజుల్లో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రస్తుత నగరి శాసనసభ్యురాలైన రోజా శిలాఫలకాలు మాత్రమే వేస్తున్నారని.. ఎక్కడా ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు.
ఇసుక, మట్టి తరలించి నగరి నియోజకవర్గ ప్రజల రక్తం పీల్చుకుని రోజా మరియు ఆమె కుటుంబ సభ్యులు కోట్లు గడిస్తున్నారని, వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే వందల కోట్ల ఆస్తులు ఎమ్మెల్యే రోజా కొన్నారని.. అవన్నీ ఎలా సంపాదించారో చెప్పాలన్నారు.
రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు.
నిండ్ర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావుని, ప్రధానకార్యదర్శి పి.విజయకుమార్ ను ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.

Discussion about this post