ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్స్ట్(ఎ.పి.యు.డబ్ల్యు.జె.) ఉపాధ్యక్షునిగా కంచల జయరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఉన్న జయరాజ్ విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు.కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన యూనియన్ 35వ రాష్ర్ట మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షునిగా ఎన్నికయిన కంచల జయరాజ్ 27ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్నారు.న ఈనాడు,వార్త దినపత్రికల్లో సుదీర్గకాలం పాటు పనిచేశారు.ప్రస్తుతం 10టీవీలో డిప్యూటీ ఇన్‌ఫుట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.ఎం.ఎ(పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్),ఎం.ఎ.(జర్నలిజం),ఎం.ఎ(తెలుగు), టెలివిజన్ జర్నలిజంలో పి.జి.డిప్లొమో చేశారు. వార్త బ్యూరో ఇన్‌ఛార్జిగా పనిచేసే సమయంలో వృత్తిలో చూపిన ప్రతిభకు సంస్థ 10దేశాలలో పర్యటించే అవకాశం కల్పించింది. జర్నలిజంలో కొత్తవారిని తయారుచేయడం కోసం వివిధ జన్నలిజం కోర్సులు నిర్వహించే కాలేజీలు,యూనివర్శిటీల్లో క్లాసులు బోధిస్తుంటారు. అనేక మంది జయరాజ్ దగ్గర జర్నలిజంలో అప్రంటీస్ చేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో సమకాలీన అంశాలపై వ్యాసాలు రాస్తుంటారు.రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను ఏడాదిపాటు నిర్వహించారు. జయరాజ్ సేవలను గుర్తించిన రాష్ర్ట ప్రభుత్వం ఈశాన్యరాష్ర్టాల్లోని ఎయిడ్స్, డ్రగ్స్ కు అలవాటు పడే వారిపై అధ్యయనం కోసం జయరాజ్‌ను ఈశాన్యరాష్ర్టాలకు పంపింది.
ఎ.పి.యు.డబ్ల్యు.జె.లో నాయకత్వ బాధ్యతలు చేపట్టినతర్వాత జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల గృహాలు,స్లలాల కోసం ప్రభుత్వంపై వత్తిడి తేవడం,డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు పెంచడం,పదవీ విరమణ చేసినజర్నలిస్టులకు నెలకు 10వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, జర్నలిసట్లు పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. వీటిని సాధించడం కోసం ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని తెలిపారు. తనకు యూనియన్ ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఉన్నుకున్నందుకు ఐ.జె.యు నాయకుల శ్రీనివాసరెడ్డి,దేవులపల్లి అమర్,అంబటి అంజనేయులు, ఎ.పి.యు.డబ్ల్యు.జె నాయకులు ఐ.వి.సుబ్బారావున,నల్లి ధర్మారావు,చందుజనార్దన్ లకు ధన్యవాదాలు తెలిపారు.
.

Discussion about this post