రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కుప్పం ఎన్నికలను గమనిస్తున్నారని, ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఓటుకి 5 నుండి 10 వేల రూపాయలు ఇచ్చి ప్రజలను ప్రలోభ పరుస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి, ఏది ఏమైనా సరే-ఎన్ని కోట్లు ఖర్చు పెట్టయినా సరే ఎన్నికల్లో గెలవాలి భావిస్తోందన్నారు. ఒక చిన్న మున్సిపాలిటిని అధికారపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎంటో అని ఆశ్చర్యం వెలిబుచ్చారు.
కుప్పంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దుర్మార్గమైనది అంటూనే, కుప్పం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తుంటే ప్రతి మూడు వాహనాల్లో రెండు వాహనాలు వైఎస్ఆర్సిపి నేతలవే అని ఆయన అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నుండి ఎమ్మెల్యేలు , సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు వార్డుల్లో తిరుగుతున్నారన్నారు.
ఇక్కడ పోలీసులు, ఎన్నికల పరిశీలకులు మరియు వాలంటిర్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని విష్ణు ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలను అధికార పార్టీ వాడుకుంటోంది. వాటిపైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో ప్రజలను భయభ్రాంతులకు చేయాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలను స్వేచ్ఛగా నిజాయితీగా జరపదని విమర్శించారు. ఈ ఎన్నికలో అధికార పార్టీ కోట్ల రూపాయలను గుమ్మరిస్తోందన్నారు.
.

Discussion about this post