ఆదర్శిని డాట్ కామ్ (adarsini.com) వెబ్ సైట్ ను iPhone లలో చదవడంలో ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది పాఠకులు మా దృష్టికి తెస్తున్నారు. అన్ని కథనాలలో చాలా అక్షరదోషాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఇది అక్షరదోషాల సమస్య కాదు. iPhone సెటింగ్స్ లో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది. చదవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ వివరాలను దిగువ screen shots సహా ఇస్తున్నాం.
అక్షరదోషాల విషయంలో ఆదర్శిని చాలా జాగరూకత పాటిస్తుంది. adarsini.com వెబ్ సైట్ కు రాస్తున్న వాళ్లందరూ సీనియర్ పాత్రికేయులు. తప్పులను వారంతట వాళ్లే సహించే వారు కాదు. ఒకటికి రెండుదఫాలు చెక్ చేసుకుంటారు. అయినా, కొన్ని పొరబాట్లు జరగవచ్చు. కథనం పబ్లిష్ అయిన తరువాత కూడా అక్షరదోషాలు గమనిస్తే సరిచేస్తున్నాము. అయితే iPhone సెటింగ్స్ లో చిన్న తేడా వలన దోషాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ‘ర’ ఒత్తి ప్రతి చోటా దోషంగానే కనిపిస్తోందని అంటున్నారు.
iPhone సెటింగ్స్ కొద్దిగా సవరించుకుంటే ఈ దోషాలు ఉండవు. ఈ తేడా వలన.. iPhone ఇతర వినియోగానికి, ఇతర వెబ్‌సైట్ లు చదవడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
1. AA (చిన్న పెద్ద A అక్షరాలు ఉండే చోట క్లిక్ చేసి సెటింగ్స్ లోకి వెళ్లండి)

2. Reader mode సెలక్ట్ చేసుకోండి.
ఈ Reader mode అనే పదం కొన్ని iPhone లలో మరోలా ఉంటుంది.

3. సైట్ రిఫ్రెష్ చేయండి
ఇప్పుడు adarsini.com లోని కథనం ఇదివరకటి అక్షరదోషాలతో కాకుండా మంచి భాషతో కనిపిస్తుంది.

ధన్యవాదాలు.
.. సంపాదకుడు
.

Discussion about this post