చిత్తూరు జిల్లా తంబలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
తదనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ జరిపారు.
హాస్పిటల్ నందు ఆరు మంది డాక్టర్లకు గానూ ఇద్దరు డాక్టర్లు ఉండటం కొద్దిగా కష్టంగా మారిందని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిమ శైలజ సర్వసభ్య సమావేశంలో కమిటీ సభ్యుల ముందు తెలిపారు.
కమిటీ సభ్యులు అందరూ కలసి ఈ విషయంపై తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కి తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిమ శైలజ, ఎంపీడీవో దివాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, రామ్మూర్తి, రమణ, తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post