జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేరు మార్చారా అని అనిపిస్తోంది. ప్రజల్లో మరింత సానుకూలతను సాధించుకోవడానికి… ప్రజల్లో తనకున్న ఆదరణను మరింత పటిష్టం చేసుకోవడానికి ఆయన మారిన వ్యూహంతోముందడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదివరకటి పోరాటయాత్రలో… ‘నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయండి’ అంటూ ప్రజలను అభ్యర్థించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు, మలి విడత పోరాటయాత్రలో.. ప్రజలను చైతన్యం చేయడం ఒక్కటే తన ప్రాథమిక లక్ష్యం అని అంటున్నారు.
పవన్ కల్యాణ్ ప్రశ్నించడమే తన లక్ష్యం అంటూ జనసేన పార్టీని స్థాపించారు. గత ఎన్నికల సమయంలో భాజపా, తెదేపాలకు సహకరించాక పార్టీ స్తబ్ధుగా ఉండిపోయింది. ఇటీవలి కాలంలో గేరు పెంచి.. చంద్రబాబునాయుడు అవినీతిని ఎండగడుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ.. పవన్ కల్యాణ్ దూసుకుపోతున్నారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రోజుల్లో కూడా.. అడపాదడపా ‘ప్రశ్నిస్తూ’ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు స్పష్టమైన పోరాటం సాగిస్తున్నారు. తాజాగా ప్రజల్లో చైతన్యం సాధిస్తే చాలు అంటున్నారు. నిజానికి ప్రజల్లో సరైన చైతన్యం ఆవిష్కృతం అయితే చాలు.. సాంప్రదాయ పార్టీలు మట్టిగొట్టుకుపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
.

Discussion about this post