ప్రపంచీకరణ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉందని ప్రధానోపాధ్యాయులు రమణయ్య అన్నారు.
మంగళవారం మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు ఒబ్బు ప్రసాద్ , వాణి ల ఆధ్వర్యంలో విద్యార్థులచే తయారు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రయోగాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలకు పదునుపెట్టే ఈ ప్రదర్శన పాఠశాల స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులతో ఆకట్టుకునేలా ప్రయోగాలను విద్యార్థులు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
Discussion about this post