చంద్రగిరిలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల, జేసీబీలతో స్వర్ణముఖిని తోడేస్తున్నారు.
శనివారం రాత్రి ఎస్ఈబి (స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో) అధికారులు మెరుపు దాడులు చేసి ఒక జేసీబీ, 4 బైకులతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
శానంబట్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక జేసీబీని, నాలుగు బైకులను సీజ్ చేసి, నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలైన రెడ్డివారిపల్లి, నరసింగాపురంలో నిఘా పటిష్టం చేశామని అధికారులు తెలిపారు. ఇసుక మాఫియా ముఠాలుగా ఏర్పడి ట్రాక్టర్ ఇసుకను 2,500, టిప్పర్ ఇసుకను 18వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.
అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబి అధికారులు హెచ్చరించారు.
Discussion about this post