పిల్లల ప్రవర్తనపై పెద్దల ప్రభావమే ఉంటుంది. చాలా సందర్భాలలో వారికి రోల్ మోడల్ గా నిత్యం కళ్లెదుట కనిపించే తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లలను సక్రమమైన రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా వ్యవహరించాలో తెలియజెప్పే లఘు చిత్రం..
దేవీప్రసాద్ ఒబ్బు దర్శకత్వంలో రూపొందించిన ‘అనుసరణ’ చూడండి ఫ
కుసుమ, రీష్మా అనే వీళ్ళిద్దరూ స్నేహితులు. ఒకే ఊరికి చెందిన వీళ్ళు రోజూ కలిసే బడికొస్తారు. కలిసే ఆడుకుంటారు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసే వెళ్తారు. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు. మామూలుగా ఇలాంటి దృశ్యాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం.
కానీ, వీళ్ళ ఇండ్లల్లో విడివిడిగా జరిగిన సంఘటనలు వీళ్లని ఎలా ప్రభావితం చేశాయో, దానికి వీళ్ళు పాఠశాలలో ఎలా ప్రతిస్పందిచారనేదే ఇప్పుడు మన ముందున్న ప్రత్యేక దృశ్యాంశం. అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు.
==
పిల్లల మనసు స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటిది. దానిపై అందమైన అక్షరాలు దిద్దాలేగాని, అడ్డదిడ్డమైన మరకలు పడేటట్లు చూడకూడదు. పిల్లలు తన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు మాట్లాడుకునే భాష, నడచుకునే నడవడిక, ప్రవర్తించే తీరు ప్రతిదీ పిల్లల మనస్సుల్లో చెరగని ముద్రవేస్తాయి.
అందుకే…
వాళ్ళ ఎదుట మంచిని గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. చెడును గురించి అసలు ప్రస్తావించకూడదు, ప్రదర్శించకూడదు.
ఏదైనా మొక్క ఎదిగేదశలో ఉన్నప్పుడు దానికి సరైన పోషకాలు అందించకపోతే అది ఎందుకూ పనికిరానిదిగా మిగిలిపోతుంది. అదే మంచి పోషకాలు అందించితే ఆ మొక్క సక్రమంగా పెరిగి పరిమళాలు వెదజల్లే పుష్పాలు, పండ్లు అందిస్తూ పదిమందికి ఉపయోగపడుతుంది.
అదేవిధంగా…
పసితనంలోనే పిల్లల మనస్సుల్లో మంచి ప్రవర్తన, నైతిక విలువలను, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించగలిగితే వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు.
ఆ దిశగా…
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాళ్ళ ఉన్నతికి దోహదపడాలనే సదుద్దేశంతో చేసిన చిరు ప్రయత్నమే ఈ దృశ్యకావ్యం.
మీ
దేవీప్రసాద్ ఒబ్బు.
.

Discussion about this post