ప్రఖ్యాత తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన, కొన్ని రోజుల కిందట సికింద్రాబాద్ కిమ్స్ లో జాయిన్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్ర 4.07 గంటలకు శివైక్యం చెందారు. ఆయన పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
అనేక మంది సినీ ప్రముఖులు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వస్తున్నారు. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మంత్రులు సినీ ప్రముఖులు నివాళులు వెలిబుచ్చుతున్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ రాత్రికి మార్చురీలోనే
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహాన్ని ప్రస్తుతానికి ఆయన స్వగృహానికి తీసుకువెళ్లడం లేదు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే మార్చురీలో ఉంచబోతున్నారు. రాత్రి 7.30 గంటలకు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి పార్థివదేహాన్ని సందర్శిస్తారని సమాచారం. ఆ సమయానికి భౌతిక కాయం సందర్శనకు వచ్చే సెలబ్రిటీలు అందరూ తిరిగి వెళ్లిపోయిన తర్వాత.. 7.30కు భౌతిక కాయాన్ని అక్కడే మార్చురీకి తరలిస్తారు.
రాత్రంతా మార్చురీలోనే ఉంచుతారు. బుధవారం ఉదయం మార్చురీ నుంచి నేరుగా ఫిలించాంబర్ వద్దకు అభిమానుల, సినీ ప్రముఖుల సదర్శనార్థం తరలిస్తారు. భౌతిక కాయాన్ని అక్కడే ఉంచుతారు. అక్కడినుంచి నేరుగా అంత్యక్రియల నిమిత్తం మహాప్రస్థానానికి తీసుకువెళ్తారు.
సిరివెన్నెల భౌతిక కాయాన్ని స్వగృహానికి తీసుకువెళ్లడం లేదు. ఇందుకు గల కారణాలు తెలియదు. సికింద్రాబాద్ కిమ్స్ లో రాత్రికి మార్చురీలో ఉంచిన తరువాత.. ఉదయం ఫిలిం ఛాంబర్ కు అటునుంచి అటే.. అంత్యక్రియలకు తీసుకు వెళతారు.
సినీ గీత రచయిత సిరివెన్నెల కన్నుమూత
సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యం తో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు మరణించారు.
సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. న్యుమోనియాతో బాధపడుతూ కొన్ని రోజులుగా సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
టెలికాం డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తూ.. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన సిరివెన్నెల చిత్రం కోసం తొలిసారిగా గేయరచయితగా కలం పట్టిన సీతారామశాస్త్రి.. తెలుగు సినీ ప్రపంచం గర్వించదగిన రీతిలో భావగర్భితమైన వేలాది పాటలను రాశారు. తొలిచిత్రం సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి.
సిరివెన్నెల చిత్రానికి సింగిల్ కార్డుగా మొత్తం అన్ని పాటలనూ తానే రాసిన సీతారామశాస్త్రి ఆ రకంగా.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి తన ఎంట్రీని చాలా ఘనంగా చాటి చెప్పారు. తెలుగు పాటకు ఒక కొత్త ధ్రువంగా తాను నిలిచారు. నిజానికి ఆయనకు సిరివెన్నెల తొలిచిత్రం కాదు. జననీ జన్మభూమిశ్చ చిత్రంలో తొలిపాట రాశారు. తర్వాత స్వాతి ముత్యం సినిమాలో వటపత్ర శాయి పాటలో కొనసాగింపు భాగం రాశారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం.. తెలుగు సినిమాకు కొత్త వన్నెలు దిద్దింది. కొత్త సొబగులు నేర్పింది. అదివరకు ఎరగనంత లోతైన, భావగర్భితమైన పాటలకు నెలవుగా సీతారామశాస్త్రి తయారయ్యారు.
తెలుగు సినిమాలలో మూడువేల పాటలకు పైగా రాసిన సిరివెన్నెలను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో కూడా సత్కరించింది.
1955 మే 20న విశాఖపట్నం సమీపం అనకాపల్లి మండలంలో సివి యోగి సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి డాక్టరు. ఆయనను కూడా డాక్టరు చేయాలని ప్రయత్నించినప్పటికీ.. సీతారామశాస్త్రికి ఆ ఆసక్తి లేదు. పదోతరగతి అర్హత మీద బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగంలో చేరారు.
తొలిపాటకే బంగారు నంది
సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూ రాసిన సిరివెన్నెల పాటలకు బంగారు నందిని గెలుచుకున్న రచయిత సీతారామశాస్త్రి. ఆయనకు ఏకంగా 11 నంది అవార్డులు వచ్చాయి. చరిత్రలో మిగిలిపోయే ఎన్నెన్నో పాటలను సీతారామశాస్త్రి రాశారు.
సీతారామశాస్త్రి శివభక్తుడు. హిందూత్వ వాది. ఆరెస్సెస్ తో ఆయనకు అనుబంధం ఉంది. సినీ పరిశ్రమలో చిన్నా పెద్దా అందరితోనూ ఆయన చాలా కలివిడిగా ఉండేవారు. అందరిపట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు. సిరివెన్నెల ఇలా అనారోగ్యంతో మరణించడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పరిశ్రమ పెద్దలంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
కిమ్స్ ఆస్పత్రి వారు విడుదల చేసిన ప్రకటన
News bulletin on Sri Sirivennela Seetharama Sastry
Date – Tuesday, November 30th 2021
Noted Tollywood lyricist Sri Sirivennela Seetharama Sastry garu passed away this afternoon at 4.07 PM. He died of Lung Cancer related Complications.
Sri Sirivennela was admitted to KIMS Hospital, Secunderabad, on 24th November with Pneumonia. He was put on ECMO to support his lungs in ICU and was under close observation.
On behalf of KIMS Hospitals, we extend our condolences to Sri Sirivennela’s family members.
Dr Sambit Sahu
Medical Director
– KIMS Hospitals
Discussion about this post