రాజంపేట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు శుక్రవారం ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్ ముక్కంటి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.
సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను కాసరం రమేష్ రాయచోటిలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మంచి మెజారిటీతో గెలుపొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి జరిగిన యుద్ధమన్నారు. అంగబలం, అర్ధబలంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుయుక్తులు సృష్టించి గెలుపొందాలని ఆశతో ముందుకు వచ్చాడన్నారు.
చంద్రబాబు పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకుల జీవితాల్లో వెలుగు నింపేది చంద్రబాబు అని… రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ఏకైక మార్గం బాబు పాలనే రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కంఠా అశోక్, కంఠా మునిరత్నం, కంఠా సుబ్బు, సుగవాసి రూజీత్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post