కుప్పం మునిసిపాలిటీకి జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహతమైన విజయాన్ని నమోదు చేయబోతోంది. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి అనర్గళంగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడుకు దారుణమైన పరాభవం తప్పేలా లేదు. కాకపోతే, అనివార్యంగా కనిపిస్తున్న ఈ ఓటమికి చంద్రబాబునాయుడు స్వయంకృత తప్పిదాలే కారణం కాబోతున్నాయి.
కుప్పం మునిసిపాలిటీ మీద అధికార పార్టీ పట్టు బిగించింది. ఎన్నికలు ఇవాళే వచ్చాయి గానీ.. నిజానికి ఈ మునిసిపల్ ఎన్నికల కోసం ఏడాది కిందటినుంచే వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రమైన కసరత్తు చేస్తూ వచ్చింది. జిల్లా రాజకీయాలు మొత్తం గుప్పిట పట్టుకుని చక్రం తిప్పే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు చిరకాలశత్రువు చంద్రబాబునాయుడు ప్రాభవాన్ని అదను చూసి కుప్పకూల్చడానికి ఎప్పటినుంచో వ్యూహాత్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఫలితం వచ్చేలోగా ఆ పర్వం పూర్తి కాబోతోంది.
కుప్పం మునిసిపాలిటీలో మొత్తం 25 వార్డులున్నాయి. అందులో ప్రస్తుతానికి ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి 15 వార్డుల వరకు వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంటుందనే సమాచారం వినిపిస్తోంది. ఆ పార్టీ తరఫున ఛైర్మన్ కాగల అభ్యర్థి సుధీర్ కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. పెద్దిరెడ్డి స్వయంగా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ విజయం ఖరారుగా కనిపిస్తుండగా.. అదే జరిగితే మాత్రం.. అందుకు కారణం చంద్రబాబునాయుడే అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.
also read : ‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి కూడా స్వయంగా రాకపోయినా సరే.. కుప్పం ప్రజలు ఆయనను ఎంతో ఆదరించారు. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. అయితే కార్యకర్తల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు.
also read : బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
చంద్రబాబు తరఫున నియోజకవర్గంలో వ్యవహారాలు చూస్తూ ఉండిన ఆయన అనుచరుడు మనోహర్, గౌనిగారి శ్రీనివాసులు మరికొందరు నాయకులు సాధారణ కార్యకర్తలను పట్టించుకోలేదనే వాదన ఉంది. వారి గురించి.. సాధారణ కార్యకర్తలు, ఇతర నాయకులు ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినా సరే ఆయన పట్టించుకోలేదు. దాంతో క్రమంతో పార్టీని, చంద్రబాబును ప్రేమించే కార్యకర్తల్లో ఆ అభిమానం సన్నగిల్లిపోయింది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దానికి తగ్గట్టుగా.. ఇవాళ మరింత ఘాటుగా వైఎస్సార్సీపీ కుప్పంపై ఫోకస్ పెడుతుండే సరికి.. వారికి పరిస్థితులు లాభిస్తున్నాయి. చంద్రబాబు పట్ల ప్రజల్లో సన్నగిల్లిన ప్రేమను వారు తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నారు. వైసీపీ గెలిచినా సరే.. కేవలం డబ్బుతోనో, అధికారం దుర్వినియోగంతోనో, పోలీసుబలంతోనో గెలిచారనే ప్రచారం పుష్కలంగా జరగవచ్చు గాక.. కానీ.. వాస్తవంగా తెలుగుదేశం నాయకులు ఆత్మసమీక్ష చేసుకుంటే గనుక.. ఈ కుప్పం ఓటమికి (ఒకవేళ అలా జరిగితే) చంద్రబాబునాయుడు ఇన్నాళ్లుగా నియోజకవర్గం పట్ల చూపించిన ఉపేక్ష ధోరణి కూడా ఒక కారణం అనే వాదన బలంగా వినిపిస్తోంది.
.

Discussion about this post