తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నగరమంతటా 30 మండపాల్లో గంగమ్మ విగ్రహాలను కొలువుదీర్చారు.
ఈ మేరకు మంగళవారం స్థానిక లక్ష్మీపురం, టీవీఎస్ షోరూం, అన్నమయ్య విగ్రహం, ముత్యాల రెడ్డి పల్లె, వైకుంఠ పురం ఆర్చి, బాలాజీ కాలనీ, కృష్ణాపురం ఠాణా, నాలుగ్గాళ్ల మండపం, అశోక్ నగర్, సుందరయ్య నగర్, అన్నారావు సర్కిల్, సుభాష్ నగర్, కాటన్ మిల్, ఆటో నగర్
ప్రాంతాల్లో గంగమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయగా….
తాజాగా గురువారం సాయంత్రం స్థానిక గిరిపురం, రుయా ఆసుపత్రి, చెన్నారెడ్డి కాలనీ, పసుపర్తి సూపర్ మార్కెట్, స్కావెంజర్స్ కాలనీ, శివజ్యోతి నగర్, జీవకోన, రాఘవేంద్ర నగర్, టీఎన్ పాళెం, సమవాయి మార్గ్, డీబీఆర్ రోడ్డు, లక్ష్మీపురం, దాసరి మఠం,సత్యనారాయణ పురం ప్రాంతాల్లో విగ్రహాలను ప్రతిష్టించారు.
గంగమ్మ తల్లి విగ్రహాలకు పసుపు,కుంకుమలు దిద్ది, పూల మాలలు, వేపాకు మాలలతో అలంకరించారు. కర్పూర హారతులిచ్చి, కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ మండపాలన్నీ గంగమ్మ స్వర కుంభాభిషేకం ఆల్బమ్ సాంగ్స్ తో సందడిగా మారాయి.
బ్రహ్మోత్సవాల తరహాలో గంగమ్మ జాతర : ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
బ్రహ్మోత్సవాల తరహాలో తిరుపతి గంగమ్మ జాతర మహోత్సవాలను నిర్వహించనున్నట్టు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి లో గురువారం సాయంత్రం గంగమ్మ విగ్రహాలు ప్రతిష్టించిన సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించుకుందామని, వేషాలు వేసుకుని అమ్మ ఆశీస్సులు పొందుదామన్నారు.
.

Discussion about this post