పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు సత్యవేడు మండలం మాదనపాలెం కు చెందిన ఉమాపతి. వివరాల్లోకి వెళితే..
చెరివి పంచాయతీ మాదన పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం ద్వారా విహారయాత్రలకు పంపుతానని ఉమాపతి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం మంచి మార్కులు సాధించిన విద్యార్థులు శుక్రవారం చెన్నై నుంచి హైదరాబాదుకు విమానం ఎక్కారు…
రెండు రోజులపాటు..
మాదన పాలెం ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పురుషోత్తం(552), వి. విష్ణు (515), మహా (509), తనుజ (505) లతోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముని మోహన్ లు చెన్నై విమనాశ్రయం నుంచి విమానంలో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ రెండు రోజులు పాటు వివిధ విహార ప్రాంతాలను సందర్శించి తిరిగి తిరుపతికి చేరుకుంటారు.
ఈ విహారయాత్రకు అయ్యే ఖర్చులను మాదనపాలెం కు చెందిన సురుటుపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉమాపతి పూర్తిగా భరిస్తున్నారు.. ఇచ్చిన మాట ప్రకారం పదో తరగతిలో మంచి మార్పు సాధించిన వారిని ప్రోత్సహించిన ఉమాపతి ప్రోత్సాహక తీరు ఇతరులకు ఆదర్శనీయంగా ఉందని స్థానికులు, ఉపాధ్యాయులు వెల్లడించారు.
Discussion about this post