తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఉపఎన్నికలు హాట్, టాప్ టాపిక్స్ నుంచి పక్కకు తొలిగాయి. ఇప్పుడు విజయశాంతి టాపిక్ హాట్ హాట్ గా ఉంది. లేడీ అమితాబ్, రాములమ్మ, ఫైర్ బ్రాండ్ ఇలా సినీ, రాజకీయ రంగాల్లో రకరకాల బిరుదులు పుష్కలంగా కలిగి ఉన్న విజయశాంతి.. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? బీజేపీలో చేరుతారా? లేదా.. ఎప్పటిలా స్తబ్ధంగా ఉండిపోయి.. ఇంకో సినిమా అవకాశం వస్తుందో లేదో వెతుక్కుంటారా? అనేది అందరూ ఆలోచిస్తున్న సంగతి.
విజయశాంతి నామ్ కే వాస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గానీ.. రాజకీయంగా కంప్లీట్ సైలెంట్ గానే ఉన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరిగినా ఆమె ఎక్కడా వినపడలేదు. కనపడలేదు. ఈ మధ్యలో.. కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి కలిసిన దగ్గరినుంచి ఆమె బీజేపీలో చేరుతోందనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకూడా నడుస్తోంది.
ఆమె బీజేపీలో చేరిపోతుందేమోనని బుజ్జగించడానికి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు క్యూ కట్టారు. దుబ్బాక ఎన్నికల హడావిడి నడుస్తుండగానే.. పార్టీ రాష్ట్ర నాయకుడు కుసుమకుమార్ ఆమె వద్దకెళ్లి భేటీ అయ్యారు. తాజాగా రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ కూడా ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు.
పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె విచారించడమూ, ప్రాధాన్యం ఇస్తాం అని వారు హామీ ఇవ్వడమూ జరిగింది. కిషన్ రెడ్డి భేటీ సంగతి మాట్లాడనే లేదని.. బీజేపీ రెండు కళ్ల సిద్ధాంతంతో మోసం చేయడం వల్లనే విజయశాంతి తమ పార్టీలో చేరారని మాణిక్యం ఠాకూర్ మీడియోతో గౌరవప్రదంగా చెప్పుకున్నారు.
ఇంతకీ అంత సీనుందా?
అయితే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఎగబడేంద సీన్.. విజయశాంతికి ఉందా అనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఆమె స్వయంగా ఎన్నికల బరిలోదిగి గెలిచి చాలాకాలం అయింది. వరుసగా ఓడిపోతూనే ఉన్నారు. సొంతంగా గెలవగలపాటి ప్రజాదరణ ఆమెకు లేదని తెేలిపోయంది. పోనీ పార్టీకి ఏ కొంచెమైనా ఉపయోగపడుతున్నారా? అంటే అదీ లేదు. పార్టీకి స్టార్ కేంపైనర్‌గా ఉన్నారు. ఉండి ఏం సాధించారు? ఆమె ప్రచారం వల్ల పార్టీకి ఏమైనా లాభం కలిగిందా అంటే అదీ లేదు. పోనీ సినిమా హీరోయిన్ గా ఆమె ప్రజలకు గుర్తున్నదేమో.. అలా ఆమెకు ఆదరణ పుష్కలంగా ఉన్నదేమో.. అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆమె చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా దారుణంగా దెబ్బకొట్టేసింది. ఆమె స్టార్ ఇమేజి కూడా పతనం అయిపోయినట్టు లెక్క! మరి రెండు పార్టీలు ఆమెకోసం ఎందుకింత వెంపర్లాడుతున్నాయనేది అర్థం కావడం లేదు.
.

Discussion about this post