రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా.. ఉండవిల్లి అరుణ్ కుమార్ కు ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఆయన ఏ విషయం గురించి మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతారని, నిజం మాట్లాడతారని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అలాంటి ఉండవిల్లి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి కొన్ని సందేహాలు లేవనెత్తుతున్నారు. కాగ్ నివేదిక నేపథ్యంలో ఈ సందేహాల గురించి చెబుతున్నారు. ప్రభుత్వం వీటికి జవాబు చెప్పకపోతే.. పరువు పోయే పరిస్థితి ఉంది.
కాలవల పనులు ఏమీ చేయకుండానే.. స్పిల్ వే పూర్తి కాగానే.. 70 శాతం పనులు అయిపోయినట్లుగా చంద్రబాబు చేస్తున్న బిల్డప్ లపై ఉండవిల్లి నిలదీస్తున్నారు. నిజానికి ఆయన గతంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన ఏ అంశాల్లో బాగుందో వాటికి కితాబిచ్చారు కూడా. పార్లమెంటులో తెదేపా ఎలా పోరాడాలో సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు పోలవరంపై విమర్శలు చేస్తున్నారు. అందుకే… చంద్రబాబు సర్కారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
.
Discussion about this post