నివర్ తుపాను చిత్తూరు జిల్లాను అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాళహస్తి లోని సువర్ణముఖి నది కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత నిండుగా ప్రవహిస్తోంది. జిల్లాలోని దాదాపుగా మొత్తం పంటపొలాలు నీటి చెరువులుగా మారాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సదుంలో ఎప్పుడో బ్రిటిష్ పాలకుల కాలంలో నిర్మించిన వంతెన ఒకటి తుపాను దెబ్బకు కుప్పకూలిపోయింది. సదుం వద్ద గల గార్గేయ నది పై అప్పట్లో బ్రిటిషర్లు ఈ వంతెన నిర్మించారు. ఇది నిర్మించి సుమారు 150 సంవత్సరాలు అయి ఉంటుందని అంచనా. ఈ తుపానుకు గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది.
నెల్లూరు జిల్లా తూర్పు కంభంపాడులో ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయారు. తాటిచెట్టును పట్టుకుని సహాయం కోసం ఎదురుచూపులు చూస్తుండగా.. స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
నెల్లూరు జిల్లాలోనే గూడూరు పంబలేరువాగు వద్ద ఇటుక బట్టీ వద్ద కాపలాదారులుగా ఉండే గిరిజన కుటుంబం వరద నీటిలో చిక్కుకున్నారు. NDRF సిబ్బంది పడవ సహాయం తో నలుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
.

Discussion about this post