ఈసారి బల్దియా ఎన్నికలు టీఆర్ఎస్‌కు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇలాటి సమయంలో ఎవ్వరైనా సరే.. తమకు ఉన్న సమస్త శక్తులను మోహరిస్తారు. కేసీఆర్ కూడా అదే పనిచేస్తున్నారు. కానీ.. ఒక్క హరీష్ తప్ప! దుబ్బాకలో పార్టీ ఓడిపోయి ఉండొచ్చు గాక.. అక్కడి ఎన్నికల పనులు మొత్తం- మరొకరిని వేలు పెట్టనివ్వకుండా- తానే చూసుకుని హరీష్ ఒక్కడే అందుకు బాధ్యుడు కావొచ్చు గాక.. కానీ అంత మాత్రాన.. ఇంతగా దూరం పెట్టడం పార్టీకి శ్రేయోదాకమేనా అనే చర్చ పలువురిలో నడుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆయనే ముందుటాండు. మామ వదిలిన బాణం అని, తాను గురి పెట్టిన విల్లు తప్పలేదు చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటాడు. కానీ ఆ బాణం నుంచి వచ్చే బుల్లెట్ లాంటి మాటలు మూగబోయాయి. గ్రేటర్ ఎన్నికల పరిధిలో కనీసం ఎక్కడైనా చూద్దాం అంటే ఆయన కనిపించకుండా పోయారు. ఆ బాణం ఎవరా అని అనుకుంటున్నారా ?
ఆయనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ముద్దుగా ఉప ఎన్నికల శాఖ మంత్రి అని పిలుచుకునే హరీష్‌రావు. ఆయన్ని ఇప్పుడు పక్కన బెడుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలకు ఏమాత్రం ప్రచారానికి సమయం లేకుండా యుద్ధ వాతావరణంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో వ్యూహచతురుడిగా పేరున్న తెరాస మంత్రి హరీష్‌రావు కూడా ప్రచార కార్యక్రమాలను తన భుజస్కంధాల మీద వేసుకుంటారని అందరూ ఊహించారు. కానీ ప్రతి ఒక్క తెరాస కార్యకర్త ఆశలకు భిన్నంగా నగర ఎన్నికల సమరాంగణంలో ఎక్కడా హరీష్ పేరు వినిపించడం లేదు.
నగరంలో ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలకు స్టార్ కేటీఆర్, కవితలు ఉంటున్నారని పార్టీ వెల్లడించింది. మరోవైపు గెలుపు వ్యుహాల సారథ్యానికి రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ దాదాపుగా నగరంలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. హరీష్ రావు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇందుకు కారణం దుబ్బాక ఎన్నికల ఫలితమేనని అంటున్నారు సీనియర్ నాయకులు. ఒక్క ఎమ్మెల్యే స్థానం ఓడిపోతే సొంత అల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి అని కూడా చూడకుండా ఇలా పక్కన పెట్టేశారేమో అని అంటున్నారు.
Follow all stories regarding GHMC elections : /GHMCelections
Follow all stories regarding Tirupat MP Bypoll : తిరుపతి ఎంపీ ఉపఎన్నిక
.

Discussion about this post